నవపక్షం, బెల్లంపల్లి, అక్టోబర్ 26:
బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఐటీ విభాగం కో-కన్వీనర్‌గా బెల్లంపల్లి పట్టణానికి చెందిన కేశవ్ సోనీ నియమితులయ్యారు.
కేశవ్ సోనీ గతంలో ఏబీవీపీ నగర సహాయ కార్యదర్శి, బాగ్ కన్వీనర్, జోనల్ ఇన్చార్జి, టెక్నికల్ సెల్ జిల్లా కన్వీనర్, విభాగ్ కన్వీనర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. అలాగే స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్‌గా, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కేంద్ర కమిటీ సభ్యుడిగా సేవలందించారు.
ఈ సందర్భంగా కేశవ్ సోనీ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో రాష్ట్ర ఐటీ విభాగం కో-కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు, రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీకి కృతజ్ఞతలు తెలిపారు.


