నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి :
చెంగిచెర్ల గాంధీనగర్ కాలనీలో విజీత్, ఉమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ పవిత్ర కార్యక్రమానికి మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ విచ్చేసి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజీత్, ఉమేష్ ముదిరాజ్‌లను, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న యువతను కూడా అభినందించారు.
యువత ఐక్యత, భక్తి భావం, సామాజిక సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన ఈ వినాయక ఉత్సవాలు మరింత ఘనంగా కొనసాగాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులు గాంధీనగర్ కాలనీ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.


