నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 21వ తేదీ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నాంపల్లిలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయం వద్ద బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్–కరుణశ్రీ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేయనున్నారు. భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడంతో పాటు అన్నప్రసాదాన్ని స్వీకరించాలని నిర్వాహకులు కోరారు.
అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


