అంతర్జాతీయ సమాచార సార్వత్రిక ప్రాప్యత దినోత్సవం

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :

డిజిటల్ యుగంలో సమాచారం కేవలం ఒక వనరు కాదు; అది ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్. ఒకప్పుడు సమాచారాన్ని పొందడం కష్టమైతే, నేడు అసలు సమస్య సమాచారం లేకపోవడం కాదు—నిజమైన సమాచారాన్ని గుర్తించడం. ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్స్, మిస్ఇన్ఫర్మేషన్, డిస్‌ఇన్ఫర్మేషన్ వంటి సమాచార అస్తవ్యస్తత (Information Disorder) సమాజ విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026 అంతర్జాతీయ సమాచార సార్వత్రిక ప్రాప్యత దినోత్సవం తీసుకున్న థీమ్ అత్యంత సమయోచితమైనది.సమాచారం హక్కు అంటే ఏమిటి?

ప్రతి పౌరుడికి ప్రభుత్వ సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. భారతదేశంలో సమాచార హక్కు చట్టం – 2005 (RTI Act) ద్వారా ఈ హక్కు బలపడింది. ఈ చట్టం వల్ల అవినీతిని ప్రశ్నించే శక్తి, ప్రజా నిధుల వినియోగాన్ని పరిశీలించే అవకాశం, పాలనలో పారదర్శకత పెరిగాయి.

సమాచారం సమగ్రత ఎందుకు కీలకం?

సత్యాన్ని దాచడం ఎంత ప్రమాదమో, అసత్యాన్ని సత్యంగా నమ్మించడం అంతకంటే ప్రమాదకరం.

నేడు ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు:

ఫేక్ న్యూస్,

డీప్‌ఫేక్ వీడియోలు,

కృత్రిమ మేధ ఆధారిత తప్పుడు ప్రచారం,

సోషల్ మీడియా రూమర్లుz

హేట్ స్పీచ్,

ఇవి ఎన్నికల నుంచి విద్య వరకు, ఆరోగ్యం నుంచి సామాజిక సామరస్యం వరకు ప్రతి రంగంపై ప్రభావం చూపుతున్నాయి.నూతన ప్రతిపాదనలు 1. ఇన్ఫర్మేషన్ లీటరసీ కార్డు (IL Card):

10వ తరగతి నుంచి ప్రతి విద్యార్థికి సమాచారం ధృవీకరణ నైపుణ్యంపై సర్టిఫికేషన్.

2. గ్రామ సహా చట్టం & డిజిటల్ హెల్ప్ డెస్క్ :

ప్రతి గ్రామ పంచాయతీలో RTI, డిజిటల్ సేవలు, ఫ్యాక్ట్ చెకింగ్‌కు ఒకే కేంద్రం.

3. స్కిలోక్రసీ “పోస్ట్ చేసే ముందు సరి చూసుకోండి ” ఉద్యమం:

ప్రతి పౌరుడు సమాచారాన్ని పంచేముందు మూడు దశల్లో ధృవీకరించే అలవాటు.

4. కృత్రిమ మేధ పరదర్శక డాష్ బోర్డు :

ప్రభుత్వ ప్రకటనలు, పథకాలకు సంబంధించిన డేటాను ప్రజలకు ఓపెన్ డ్యాష్‌బోర్డ్‌లో అందుబాటులో ఉంచడం.

5. సమాచార వాలంటీర్స్ నెట్వర్క్ :

జాతీయ సేవా పధకం , నెహ్రు యువ కేంద్ర సంఘటన్ , రెడ్ క్రాస్, లీగల్ సర్వీసెస్ వాలంటీర్లతో జిల్లా స్థాయిలో సమాచార అవగాహన బృందాలు.స్కిలోక్రసీ సందేశం

నైపుణ్యం అంటే కేవలం ఉపాధి కాదు; సరైన సమాచారాన్ని గుర్తించి బాధ్యతగా ఉపయోగించడం కూడా ఒక కీలక జీవన నైపుణ్యమే. డిజిటల్ యుగంలో Information Literacy(సమాచార అక్షరాస్యత )ప్రతి పౌరుడికి తప్పనిసరి స్కిల్ కావాలి.

వికసిట్ భారత్ 2047 దిశగా

2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించాలంటే డిజిటల్ మౌలిక సదుపాయాలతో పాటు సమాచార సమగ్రతను కూడా బలోపేతం చేయాలి. SDG-16 లక్ష్యాలకు అనుగుణంగా పారదర్శక పాలన, జవాబుదారీతనం, పౌర భాగస్వామ్యం పెరిగినప్పుడే విశ్వాసపూరిత సమాజం నిర్మితమవుతుంది.

“సమాచారాన్ని తెలుసుకునే హక్కు పౌరుడికి శక్తినిస్తే, సమాచార సమగ్రత సమాజానికి విశ్వాసాన్ని ఇస్తుంది.”

— మధుబాబు చికిలే, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డైరెక్టర్

Hot this week

ACB వలలో నాంపల్లి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ప్రైవేటు వ్యక్తి

నవపక్షం, నాంపల్లి, సెప్టెంబర్ 28: వ్యవసాయ భూమికి సంబంధించిన పంచనామా నివేదికను...

అంతర్జాతీయ సమాచార సార్వత్రిక ప్రాప్యత దినోత్సవం

నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 28: డిజిటల్ యుగంలో సమాచారం కేవలం ఒక...

పబ్బు రాజు గౌడ్ మాతృమూర్తి పబ్బు వజ్రమ్మకు కాంగ్రెస్ నాయకుల నివాళి

నవపక్షం, మునుగోడు ప్రతినిధి : మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త,...

గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు

  నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :  స్వాతంత్ర్య సమరయోధుడు,విప్లవ కెరటం,షాహిద్ భగత్‌సింగ్ జయంతి...

తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్న బబ్లు

నవపక్షం,గూడూరు ప్రతినిధి :  తండ్రిపై తనకున్న ప్రేమను చాటుతూ తీపలపూడి బబ్లు తీసుకున్న...

Topics

గణనాథుడి గ్రామోత్సవంతో మార్మోగిన కోట దళితవాడ

నవపక్షం, గూడూర్ ప్రతినిధి: కోట మండలంలోని కోట దళితవాడలో ఎసీసీ అంబేద్కర్ క్రికెట్...

శ్రీ ప్రగతి కాలేజి లో 40 మందిలో 10 మంది విద్యార్థులకు 9కి పైగా గ్రేడ్ పాయింట్లు

నవపక్షం, గూడూర్ ప్రతినిధి: ఇటీవల విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విడుదల చేసిన డిగ్రీ...

చిట్టీల పేరుతో భారీ మోసం – రూ. 10 కోట్ల వసూల్ చేశారన్న ఆరోపణలు

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి : చివ్వెంల మండలం లక్ష్మీ నాయక్ తండాకు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.