నవపక్షం, కోట ప్రతినిధి :
కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో కట్ట చివర వెలసి ఉన్న శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం సన్నిధిలో గూడలి గ్రామానికి చెందిన గుండాల మధుసూదన్ యాదవ్ జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శరవణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మధుసూదన్ యాదవ్,ఆయన శ్రీమతి ప్రియ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం మధుసూదన్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సుమారు 100 మంది నిరుపేదలు,భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాగే పేదలకు అన్నదాన బాక్సులను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శరవణ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను పేదలు,భక్తుల మధ్య సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. మధుసూదన్ యాదవ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ,భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రావు స్నేహితులు నాగార్జున్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


