నవపక్షం, కోట ప్రతినిధి :
కోట మండలం కోట సెక్టార్ పరిధిలోని రవి నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం–2026 మన అంగన్వాడీ–మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 9వ జాతీయ పోషణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ మునికుమారి ఆదేశాల మేరకు,సూపర్వైజర్ కృష్ణమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోట మండల బీజేపీ అధ్యక్షుడు గునుపూడి హరిబాబు తన సొంత నిధులతో ఏడు మంది గర్భిణీ స్త్రీలకు చీరలు,జాకెట్లు అందించి ఘనంగా శ్రీమంతం నిర్వహించారు.
హరిబాబు సొంత నిధులతో మానవతా సేవ
గర్భిణీ స్త్రీలకు అవసరమైన వస్త్రాలను అందించి,వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన గునుపూడి హరిబాబు సేవలను పలువురు అభినందించారు. మహిళలు,చిన్నారుల సంక్షేమం పట్ల ఆయన చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు అంగన్వాడీ సిబ్బంది, గర్భిణులు,తల్లులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సూపర్వైజర్ కిష్టమ్మ గర్భిణులు, బాలింతలు,చిన్నారుల తల్లులకు పౌష్టికాహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు,గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మహిళలు,చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచించారు.
అనంతరం గునుపూడి హరిబాబు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా రవి నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మహిళలు,చిన్నారుల సంక్షేమం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించి అవసరమైన సామగ్రిని అందించడం ద్వారా మానవతా దృక్పథాన్ని చాటుకున్న హరిబాబును పలువురు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోటా రెడ్డి,డాక్టర్ రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి విశ్వనాథం సాయి,మంగమ్మ,మండల ట్రెజరర్ పరశురాం సాయి,బీజేపీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,అంగన్వాడీ సిబ్బంది,గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.


