నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేసి, వారితో కొంతసేపు ఆప్యాయంగా గడిపారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంజయ్ గణాత్ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సంజయ్ గణాత్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి ఒక్కరి పట్ల ఆప్యాయత, సేవాభావంతో ముందుకు సాగడమే బీజేపీ కార్యకర్తల లక్ష్యమని తెలిపారు. వృద్ధులతో సమయం గడపడం, వారి యోగక్షేమాలను తెలుసుకోవడం ద్వారా మానవత్వం, సామాజిక బాధ్యత మరింత బలపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కేతావత్ లాలు నాయక్, నల్లగొండ జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ జల్దా భాస్కర్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణదాసు చండీశ్వర్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
