నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :
నాంపల్లి మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ సరస్వతీ దేవి అవతారంలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్య, జ్ఞానం, విజ్ఞానానికి ప్రతీకగా కొలిచే సరస్వతీ దేవిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.
ఈ సందర్భంగా నాంపల్లి పట్టణ పురోహితులు ఉప్పల యశ్వంత్ శర్మ విద్యార్థులకు పుస్తకాలు, బలపాలు, పెన్నులు, పలకలు పంపిణీ చేశారు. విద్యార్థులు సరస్వతీ దేవి ఆశీస్సులతో విద్యలో రాణించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అమ్మవారి పూజలతో పాటు విద్యార్థులను ప్రోత్సహించేలా విద్యా సామగ్రి పంపిణీ చేయడం కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.


