నవపక్షం, దేవరకద్ర ప్రతినిధి :
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
ఈ క్రమంలో దేవరకద్ర నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జీగా తెలంగాణ రాష్ట్ర టాడీ ట్యాపర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ని నియమించారు.
పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన బాధ్యతలను సమన్వయంతో నిర్వహిస్తూ, నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లనున్నారు.
ఈ సందర్భంగా పల్లె రవి కుమార్ గౌడ్ కి పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు.


