నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :
శంషాబాద్‌లోని మల్లిక కన్వెన్షన్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్‌గా నియమితులైన మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ను మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో మధుయాష్కి గౌడ్ కీలక పాత్ర పోషించారని, ఏఐపీసీ చైర్మన్‌గా నియామకం కావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జులు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.


