నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :
పద్మశ్రీ మంద కృష్ణ మాదిగను డా. ఎం.డి. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి (OU) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగ యువత అభ్యున్నతిపై చర్చించారు. పట్టభద్రుల సమస్యలకు చట్టసభలో బలమైన గొంతుకగా నిలవాలనే లక్ష్యంతో స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందుకు సాగుతున్న తనకు ఆశీస్సులు, మద్దతు అందించాలని డా. ఆరిఫుద్దీన్ కోరారు.
కల్వకుర్తి ప్రగతి ఫౌండేషన్ చైర్మన్గా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయన, పట్టభద్రుల హక్కుల పరిరక్షణ, ఉపాధి అవకాశాల కల్పన, యువత భవిష్యత్తుకు భరోసా కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, పట్టభద్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు.


