నవపక్షం, రాయవరం, అక్టోబర్ 27:
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వర్తించనున్న పోలింగ్ అధికారులు (పీవోలు), సహాయ పోలింగ్ అధికారులు (ఏపీవోలు)లకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేక అధికారి ఎన్.వి.ఎస్.ఎస్.ఎన్. మూర్తి, మండల ప్రత్యేక అధికారి బి. శశాంక, ఎంపీడీవో కె.వి.ఎస్.ఎస్. సూర్యనారాయణమూర్తి పాల్గొని పోలింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు.
మాస్టర్ ట్రైనర్ల ద్వారా బ్యాలెట్ల వినియోగం, పోలింగ్ బాక్సుల సీలింగ్, పోలింగ్ బూత్ల ఏర్పాటు, ఎన్నికల విధివిధానాలు తదితర అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధులను నిబంధనలకు అనుగుణంగా, సమర్థవంతంగా నిర్వహించేలా పోలింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.

