నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి :
శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతుల పంట పొలాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శివన్నగూడెం గ్రామంలో నిరసన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రిజర్వాయర్ను సందర్శించి పనుల పరిస్థితిని పరిశీలించారు.
రిజర్వాయర్ పనులు పూర్తికాకపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని నాయకులు కోరారు. తక్షణమే స్పందించి నిర్మాణ పనులను వేగవంతం చేసి, సాగునీరు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, జిల్లా నాయకులు, మండల, పట్టణ అధ్యక్షులు, మండల నాయకులు,భారీగా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

