నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి :
రాజపేట మండలం పాముకుంట గ్రామానికి చెందిన వార్డ్ సభ్యులు రంగ నరేష్ గౌడ్, జర్నలిస్టు రంగ కవితల తండ్రి రంగ స్వామి ఇటీవల పరమపదించారు.
రంగ స్వామి మృతి విషయం తెలుసుకున్న సుదగాని ఫౌండేషన్ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ వారి నివాసానికి వెళ్లి, రంగ స్వామి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా రంగ స్వామి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


