నవపక్షం, నల్లబెల్లి, అక్టోబర్ 02:
నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మామిళ్ల చెరువు నీటి సంఘం మాజీ వైస్ చైర్మన్ కలిమి కుమారస్వామి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా శుక్రవారం నల్లబెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ బానోతు సారంగపాణి ఆయనకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు తిప్పారపు రాంబాబు, గ్రామ సర్పంచ్ దండం సంపత్, ఉప సర్పంచ్ సూరబోయిన రాంబాబు, మాజీ ఎంపీటీసీ గుండాల రాజ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.


