నవపక్షం, విశాఖపట్నం ప్రతినిధి :
గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌ను పురస్కరించుకుని టీడీపీ నాయకురాలు లక్ష్మీ భార్గవి దువ్వాడ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చోదే వెంకట పట్టాభిరామ్ తో కలిసి ఖాదీ సంతలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శనను సందర్శించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ ప్రోత్సహించిన ఖాదీ, చేనేత రంగాల ప్రాధాన్యతను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింస, స్వదేశీ భావాలు నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా చేనేత కార్మికులు, కళాకారులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
గాంధీజీ ఆశయాలు, సేవా స్ఫూర్తి ప్రజల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచేలా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

