Monday, November 9, 2026

ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి ఉండాలి.. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి – డా. చందుపట్ల కీర్తి రెడ్డి

వపక్షం, భూపాలపల్లి ప్రతినిధి :

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు.

జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ టెంపుల్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన తిరంగా యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

జాతీయ జెండాలను చేతబూని బీజేపీ నాయకులు, కార్యకర్తలు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో భూపాలపల్లి పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా డా. చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ, జాతీయ జెండా ప్రతి భారతీయుడి గౌరవానికి ప్రతీక అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు.

“హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కేవలం ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం మాత్రమే కాదు.. ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి భావాన్ని మరింత బలపరచడం” అని అన్నారు.

ప్రతి కుటుంబం తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని, జాతీయ జెండాను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

“మన జెండా – మన గౌరవం.. మన దేశం – మన బాధ్యత. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి.. ప్రతి హృదయంలో దేశభక్తి వెల్లివిరియాలి” అని ఆమె అన్నారు.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశభక్తి స్ఫూర్తితో ఘనంగా నిర్వహించాలని డా. చందుపట్ల కీర్తి రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి ప్రసాదరావు, జన్నే మొగిలి, ఎరుకల గణపతి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాలుగో వార్డు కౌన్సిలర్ కన్నం యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్, పెండ్యాల రాజు, అర్బన్ ప్రెసిడెంట్  సంపత్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సేనాపతి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుప్పటి భద్రయ్య, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దేశెట్టి గోపాల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్, ఎస్టీ మోర్చా జిల్లా ప్రెసిడెంట్  రాజనాయక్, లీగల్ సెల్ కన్వీనర్ చీర్ల అశోక్ రెడ్డి, ఎండోమెంట్ కన్వీనర్ జయపాల్ రెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సామల మధుసూదన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శివరాత్రి వేణు, జిల్లా నాయకులు తుమ్మిటి రామిరెడ్డి, తిరుపతి రవికుమార్, కంబాల రాజన్న, పొన్నాల కొమరయ్య, రవీందర్, అర్బన్ ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి, బీజేవైఎం నాయకులు ఊడత నాగరాజు, లాడే శివ, భగవాన్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, బూత్ అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Hot this week

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: దేవరకొండ డిఎం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ RTC డిపో ఆధ్యర్యంలో కార్తీక మాసం...

కాచారం గ్రామంలో 27వ రోజు ధర్నా

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలంలో కాచారం గ్రామంలలో జరుగుతున్న మైనింగ్...

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

Topics

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: దేవరకొండ డిఎం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ RTC డిపో ఆధ్యర్యంలో కార్తీక మాసం...

కాచారం గ్రామంలో 27వ రోజు ధర్నా

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలంలో కాచారం గ్రామంలలో జరుగుతున్న మైనింగ్...

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.