Sunday, November 8, 2026

ప్రత్యేక అధికారులు మండల కేంద్రాల్లో విస్తృతంగా పర్యటించాలి పాఠశాలలు, కేజీబీవీలు, పంచాయతీలు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించాలి: జిల్లా కలెక్టర్ ప్రియాంక

నారాయణపేట, ఆగస్టు 14 (నవపక్షం, నారాయణపేట ప్రతినిధి):

నారాయణపేట జిల్లాలో ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన మండలాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. కొడంగల్ నియోజకవర్గంలోని గుండుమాల్‌తో పాటు వివిధ మండలాల్లో నెలకొన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

దామరగిద్ద, మద్దూరు, ధన్వాడ, కోస్గి, కృష్ణా మండలాల్లో 286 మంది పిల్లలు ఉన్నారని ప్రత్యేక అధికారి రహమాన్ తెలిపారు. ఆయా కేజీబీవీలను తనిఖీ చేసినట్లు వివరించారు. హిందూపూర్ కేజీబీవీలో 443 మంది విద్యార్థులు ఉండగా, టాయిలెట్లకు మరమ్మతులు అవసరమని తెలిపారు. మాగనూరు కేజీబీవీలో 369 మంది విద్యార్థులు ఉన్నారని, అదనపు గదులు, కాంపౌండ్ వాల్ అవసరమని వివరించారు.

మక్తల్‌లో 250 మంది పిల్లలు ఉన్నారని, మరికల్, అప్పంపల్లి పాఠశాలల్లో కిటికీలు, డైనింగ్ హాల్ అవసరమని ప్రత్యేక అధికారులు తెలిపారు. డైనింగ్ హాల్ వంటి అవసరమైన పనులకు 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవచ్చని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అధికారులకు కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మండల కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని, పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పీఎస్సీలు, ఎంపీపీఎస్ పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించి అక్కడి సమస్యలను గుర్తించాలన్నారు.

డ్రై డే కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేజీబీవీల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను పరిశీలించాలని సూచించారు. ఊట్కూరు, నారాయణపేట మండలాల అవసరాలపై సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.

అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.