నవపక్షం, యాదాద్రి భువనగిరి ప్రతినిధి :
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధి, సమగ్ర ప్రగతి కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల-వెంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


