నవపక్షం, రేగొండ మండల ప్రతినిధి :
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రేగొండ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశిధర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులందరికీ ఘన నివాళులు అర్పించారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛా భారతదేశంలో జీవిస్తున్నామని పేర్కొన్నారు.
గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో మౌలిక వసతుల కల్పన, పేదల సంక్షేమం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలలో గణనీయమైన పురోగతి సాధించామని నాయకులు తెలిపారు. పేదలకు ఉచిత రేషన్, పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఉచిత గ్యాస్ కనెక్షన్లు వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకొచ్చామని పేర్కొన్నారు.
అదేవిధంగా డిజిటల్ సేవల విస్తరణ, గ్రామీణ మరియు జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వేలు, విమానాశ్రయాలు, ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధి వంటి అనేక రంగాల్లో దేశం గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో “సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్ – సబ్కా ప్రయాస్” అనే స్ఫూర్తితో దేశం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజలందరూ బాధ్యతాయుత పౌరులుగా దేశ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి ప్రసాదరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పోల్సాని తిరుపతిరావు, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాటికంటి రవికిరణ్, జిల్లా నాయకులు మోత్కుపల్లి బుచ్చిరెడ్డి, గన్రెడ్డి లింగారెడ్డి, ఎస్టీ మోర్చా నాయకులు కూరాకుల మల్లయ్య, BJYM జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలీఫ్, మండల ప్రధాన కార్యదర్శులు దయ్యాల కిరణ్, తూర్పాటి మల్లేష్, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి, మండల నాయకులు మేకల రవీందర్, రమణారెడ్డి, కౌడగాని రాకేష్, బూత్ అధ్యక్షులు చల్ల విక్రమ్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


