నవపక్షం, యాదాద్రి భువనగిరి ప్రతినిధి :
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కుకుటపు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో భువనగిరిలోని IVF కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి IVF, IHRCI సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా IVF యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుకుటపు చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. అలాగే సమాజ సేవకు సంబంధించిన మరిన్ని కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
IHRCI యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇటిక్యాల లావణ్య స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతను వివరిస్తూ దేశభక్తి, సామాజిక బాధ్యత, సేవా కార్యక్రమాలపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రతి అమావాస్య రోజున అన్నదానం నిర్వహించేందుకు సహకరిస్తున్న దాతలను శాలువాలతో సత్కరించి, షీల్డులను అందజేశారు. సేవా కార్యక్రమాలకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో మహిళా విభాగం నాయకురాలు కుకుటపు సంధ్యారాణి, పట్టణ అధ్యక్షుడు సోమ కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి బిజ్జల శ్రీనివాస్, పట్టణ కోశాధికారి జంగాల హనుమంతరావు, కార్యవర్గ సభ్యులు చంద్రాల సత్యనారాయణ, కుకుటపు అశోక్, కుకుటపు శ్రీకాంత్, అర్థం నవీన్, తడక మురళి, నాగేందర్, రుఖ్మయ్య, సుభాష్, నల్ల నరసింహ, కుకుటపు తేజస్వి, అర్థం నీలిమ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు, సభ్యులు, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


