Monday, November 9, 2026

తాజ్‌పూర్ గ్రామంలో ఘనంగా 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్

తాజ్‌పూర్: 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తాజ్‌పూర్ గ్రామంలో శనివారం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గౌరవ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.

సర్పంచ్ అధ్యక్షతన గ్రామపంచాయతీ ఆవరణలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తల్లి పాల వారోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామసభ నిర్వహించిన అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.

అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, గాంధీ చౌరస్తా, వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో పలుచోట్ల జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక MPUP పాఠశాలలోని కళాతోరణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సభా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి, శ్రీ ర్యాకల సంతోష శ్రీనివాస్, పాఠశాల శాశ్వత దాత, సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి

ఈ సందర్భంగా సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే మనకు లభించిన స్వాతంత్ర్యమని అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే గొప్ప పండుగ స్వాతంత్ర్య దినోత్సవమని పేర్కొన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుస్తూ సమాజం పట్ల తమ వంతు కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే దేశ అభివృద్ధి సంపూర్ణమవుతుందని అన్నారు.

గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, స్వాతంత్ర్య సమరయోధుల కలలు సాకారం అవుతాయని తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, గ్రామాభివృద్ధికి గ్రామ ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు.

తాజ్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలతో అధునాతన పద్ధతుల్లో విద్యాబోధన జరుగుతోందని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి వసతులు

పాఠశాల శాశ్వత దాత, సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో అధునాతన పద్ధతుల్లో, కార్పొరేట్ స్థాయి వసతులతో పాఠశాలను పునరుద్ధరించినట్లు తెలిపారు.

ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం ద్వారా విద్యాబోధనతో పాటు విద్యార్థులకు రవాణా సౌకర్యం, నోటుపుస్తకాల పంపిణీ, యూనిఫామ్‌లు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను తమ RSK ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాలకవర్గ సభ్యులు, యువజన సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, పంచాయతీ కార్యదర్శి నర్సింగ్ రావు, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఏఏపీసీ చైర్మన్ వరిగంటి రమ్య, వైస్ చైర్మన్ బొమ్మారపు అనురాధ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహమ్మద్ గాలిబీ యాకుబ్, బొమ్మారపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మీ బాలరాజు, బీట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్, ఉపాధ్యాయ బృందం, ఎఫ్‌ఏ పల్లెపాటి రామస్వామి, అంగన్‌వాడీ టీచర్ ఊర్మిళ, ఆశ కార్యకర్త అరుణ, గ్రామ పెద్దలు, పురప్రముఖులు, యువజన సంఘాల నాయకులు, మహిళలు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది, గ్రామ ప్రజలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామమంతా దేశభక్తి నినాదాలు, జాతీయ పతాకాలతో సందడిగా మారగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ముగిశాయి.

Hot this week

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: దేవరకొండ డిఎం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ RTC డిపో ఆధ్యర్యంలో కార్తీక మాసం...

కాచారం గ్రామంలో 27వ రోజు ధర్నా

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలంలో కాచారం గ్రామంలలో జరుగుతున్న మైనింగ్...

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

Topics

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: దేవరకొండ డిఎం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ RTC డిపో ఆధ్యర్యంలో కార్తీక మాసం...

కాచారం గ్రామంలో 27వ రోజు ధర్నా

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలంలో కాచారం గ్రామంలలో జరుగుతున్న మైనింగ్...

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.