నవపక్షం, హైదరాబాద్ :
నవపక్షం దినపత్రిక రంగారెడ్డి జిల్లా కరస్పాండెంట్‌గా సోమా జ్ఞానేశ్వర్ యాదవ్ నియమితులయ్యారు. జర్నలిజం రంగంలో తన అనుభవం, సామాజిక అంశాలపై అవగాహనతో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక అంశాలు, రాజకీయ పరిణామాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ నవపక్షం దినపత్రిక తరఫున సమర్థవంతంగా పనిచేయాలని యాజమాన్యం ఆకాంక్షించింది.
ఈ సందర్భంగా సోమా జ్ఞానేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నవపక్షం దినపత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకురావడంతో పాటు, వాస్తవాలను ప్రజలకు అందించేందుకు అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.
ప్రజల గొంతుకగా నవపక్షం దినపత్రికను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.


