Sunday, November 8, 2026

పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – ఫుడ్ సెక్యూరిటీ స్మార్ట్ కార్డులతో పారదర్శకంగా రేషన్ సరఫరా – ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్నబియ్యం – మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ సెక్యూరిటీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలు గౌరవంగా నాణ్యమైన సన్నబియ్యం తినాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో పండించిన సన్నరకం వరిధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తూ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి అర్హులైన ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నట్లు తెలిపారు.

స్మార్ట్ కార్డుతో పారదర్శకత

ఫుడ్ సెక్యూరిటీ స్మార్ట్ కార్డు ద్వారా రేషన్ సరఫరాలో పారదర్శకత పెరుగుతుందని మంత్రి తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్ బియ్యం పొందిన వివరాలు డిజిటల్ విధానంలో నమోదవుతాయని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

కొత్త రేషన్ కార్డుల మంజూరు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, తొలగింపు వంటి అంశాల్లో గతంలో ఎదురైన ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఫుడ్ సెక్యూరిటీ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు.

ప్రతి గ్రామంలోనే రేషన్ బియ్యం అందేలా చర్యలు

నారాయణపేట జిల్లాలో కొంతమంది లబ్ధిదారులు రేషన్ బియ్యం కోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తున్న పరిస్థితిని మంత్రి ప్రస్తావించారు. దీనివల్ల కూలి పనులు కోల్పోవడంతో పాటు ప్రయాణ ఖర్చులు భరించాల్సి వస్తోందన్నారు.

జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఏ గ్రామానికి చెందిన రేషన్ కార్డుదారులు ఆ గ్రామంలోనే రేషన్ బియ్యం పొందేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా, అందుబాటులో ఉండేలా అధికారులు పనిచేయాలని కోరారు.

రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

రేషన్ డీలర్లు పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమాన్ని చేరవేసే కీలక భాగస్వాములని మంత్రి అన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, ప్రజలు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల సంక్షేమం, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు తదితర కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

“పేదవాడి ఇంట్లో ఉన్న పిల్లవాడు తినే ఆహారం, పెద్దవాడి ఇంట్లో ఉన్న పిల్లవాడు కూడా తినాలనే సమానత్వ దృక్పథంతో ప్రభుత్వం పనిచేస్తోంది. పేదల సంక్షేమం, గౌరవప్రదమైన జీవనం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ప్రియాంకతో కలిసి మంత్రి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, ఆర్డీవో రమేష్, స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్, వైస్ చైర్‌పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివ రెడ్డి, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంత్ కుమార్, ఆర్టీఏ మెంబర్ పోషల్ రాజేష్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బాల్ రాజ్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సైదులు, అన్ని మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, రేషన్ షాప్ డీలర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.