- నవపక్షం, ధన్వాడ ప్రతినిధి :
దివంగత మక్తల్ ఎమ్మెల్యే శ్రీ చిట్టెం నర్సిరెడ్డి 21వ వర్ధంతి, ఆయన కుమారుడు స్వర్గీయ చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో స్మరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు చిట్టెం కుటుంబ సభ్యులు స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి, చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకుంటూ అంజలి ఘటించారు.
ఈ కార్యక్రమానికి ధన్వాడ మండల ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, చిట్టెం కుటుంబ అనుచరులు పెద్ద ఎత్తున హాజరై దివంగత నేతలకు నివాళులు అర్పించారు.


