నవపక్షం, ధన్వాడ ప్రతినిధి:
దివంగత మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి 21వ వర్ధంతి, ఆయన కుమారుడు చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో స్మరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాలమూరు ఎంపీ డీకే అరుణ, మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి స్వర్గీయులు చిట్టెం నర్సిరెడ్డి, చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకుంటూ అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా చిట్టెం కుటుంబ సభ్యులు, అభిమానులు వారి సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రజల కోసం వారు చేసిన సేవలు, మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి అందించిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, చిట్టెం కుటుంబ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని దివంగత నేతలకు నివాళులర్పించారు.


