చిట్టెం నర్సిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ప్రజా సేవలోనే ప్రాణాలు కోల్పోయిన ప్రజా నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి: ఎంపీ డీకే అరుణ

నారాయణపేట: దివంగత మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, ప్రజా నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె, ఎంపీ డీకే అరుణ ఘనంగా నివాళులర్పించారు. చిట్టెం నర్సిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, చిట్టెం నర్సిరెడ్డి స్మృతి వనం వద్ద పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, ప్రజా నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి నారాయణపేట జిల్లాతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని గుర్తుచేశారు. ప్రజా జీవితానికే అంకితమై, ప్రజల కోసం పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన గొప్ప నాయకుడని కొనియాడారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల సంక్షేమం, అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం తన తండ్రి తుది శ్వాస వరకు కృషి చేశారని అన్నారు. ఆయనను నక్సలైట్ల కాల్పుల్లో కోల్పోవడం తమ కుటుంబంతో పాటు నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

చిట్టెం నర్సిరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని, ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు.

2005 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సమయంలో ప్రజా నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి నక్సలైట్ల కాల్పుల్లో దారుణంగా హత్యకు గురయ్యారని, ఆయన మరణం ప్రజల గుండెల్లో నేటికీ మానని గాయంగా మిగిలిపోయిందని అన్నారు.

చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా సేవలందిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి విశేష కృషి చేశారని ఎంపీ డీకే అరుణ కొనియాడారు.

వర్ధంతి సందర్భంగా చిట్టెం నర్సిరెడ్డిని స్మరించుకునేందుకు అభిమానులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘన నివాళులర్పించారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.