అంబేద్కర్ భవన నిర్మాణం, జగ్జీవన్ రామ్ భవన మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలి: బిజెపి ఎస్సీ మోర్చా డిమాండ్
మన ప్రాంతంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని, అలాగే తీవ్ర పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరిన బాబూ జగ్జీవన్ రామ్ భవనానికి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని కోరుతూ బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలసి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా భువనగిరి పట్టణ ఎస్సీ మోర్చా గాయపాక పృథ్వీరాజ్ మాట్లాడుతూ… దళిత, బహుజన బిడ్డల విద్యా, సామాజిక అభ్యున్నతికి, వివిధ సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈ భవనాలు ఎంతో కీలకమని తెలిపారు. నూతన అంబేద్కర్ భవన నిర్మాణం ఆలస్యం కావడం, ఉన్న జగ్జీవన్ రామ్ భవనం సరైన నిర్వహణ లేక పాడైపోవడంతో స్థానిక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రధాన డిమాండ్లు:
నూతన అంబేద్కర్ భవన నిర్మాణానికి తగిన నిధులు కేటాయించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
బాబూ జగ్జీవన్ రామ్ భవనానికి తక్షణమే మరమ్మత్తులు పూర్తి చేసి, అన్ని వసతులతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.
వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ గారు సమస్యపై సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి భవనాల నిర్మాణం మరియు మరమ్మత్తు పనులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ బండారు స్వర్ణలత రమేష్ కోటి బండారు లోకేశ్వర్ కార్పాటి రాజు ఎర్రవెల్లి నాగరాజు డాక్టర్ జేరిపోతుల భరత్ బిజెపి ఎస్సీ మోర్చా నాయకులు, బిజెపి ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇట్లు,
భారతీయ జనతా పార్టీ & ఎస్సీ మోర్చా
భువనగిరి
అంబేద్కర్ భవన నిర్మాణం, జగ్జీవన్ రామ్ భవన మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలి: బిజెపి ఎస్సీ మోర్చా డిమాండ్
Popular Categories

