కొత్తగూడెం జిల్లా -నవ పక్షం :- ప్రతినిధి:శివాజీ
కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్వదేశీ విదేశీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రైతు కార్మిక ప్రజలకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా బ్రిటన్ న్యూజిలాండ్ యూరోపియన్లతో కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నది దీనికి వ్యతిరేకంగా దేశంలోని రైతులు మరియు శ్రామిక ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర వ్యవసాయ, ఆర్థిక, సామాజిక సంక్షోభంపై మీ తక్షణ దృష్టిని6 ఆకర్షించడానికి డిమాండ్ల చార్టర్తో పాటు ఈ మెమోరాండాన్ని సంయుక్త కిసాన్ మోర్చా (skm)జాతీయ కమిటీ పిలుపు భాగంగా అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ కి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పిచటం జరిగింది.ఈసందర్బంగా skm నాయకులు అమర్లపూడి రాము, దొడ్డ లక్ష్మీనారాయణ, సుంకి పాక ధర్మ, గోకినపల్లి ప్రభాకర్ మోరంపూడి శ్రీనివాసరావు లు మాట్లాడుతూ*
ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన చారిత్రాత్మక రైతు పోరాటం సందర్భంగా, 2021 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి, రుణమాఫీ, విద్యుత్ ప్రైవేటీకరణ మరియు రైతులపై కేసుల ఉపసంహరణపై ఇచ్చిన లిఖితపూర్వక హామీని అమలు చేయకపోవడంపై వీరు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం వ్యక్తం చేశారు
ఢిల్లీ సరిహద్దుల్లో 385 రోజుల పాటు కొనసాగిన నిరంతర భారీ మహాపడావ్ పోరాటం రేయింబవళ్లు శాంతియుత ఉద్యమం జరిగిందన్నారు ఆ ఉద్యమంలో 736 మంది అమరులయ్యారని అ అమరవీరుల ప్రాణత్యాగం నేపథ్యంలో 2020 నవంబర్ లో ఏర్పడినప్పటి నుండి, అన్ని పంటలకు సేకరణతో కూడిన చట్టబద్ధమైన C2+50% ఎంఎస్పి, గ్రామీణ రుణభారాన్ని,మరియు తత్ఫలితంగా జరుగుతున్న రైతులు, దినసరి కూలీల విస్తృత ఆత్మహత్యలను అంతం చేసేందుకు సమగ్ర రుణమాఫీ, మరియు విద్యుత్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం అనే ప్రధాన డిమాండ్లను సాధించేందుకు ఎస్ కెఎం (SKM) పోరాట మార్గంలో అలుపెరగకుండా ఉద్యమం కొనసాగిందన్నారు
స్వాతంత్య్రానంతరం జరిగిన అతి పెద్ద ప్రజా పోరాటమైన, శ్రామిక వర్గ ఉద్యమం నిర్వ్యా జన మద్దతుతో సాగిన ఈ రైతు పోరాటం 2021 నవంబర్ 19న 3 వ్యవసాయ చట్టాల రద్దును సాధించింది. 2021 డిసెంబర్ 9 నాటి లిఖితపూర్వక హామీతో డిసెంబర్ 11న పోరాటాన్ని విరమించారు. అయితే, గత ఐదేళ్లలో ఎన్డీఏ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఏ హామీలను అమలు చేయలేదనారు
శ్రామిక ప్రజలపై పెరుగుతున్న కార్పొరేట్ దాడి గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గిట్టుబాటు ధర C2+50% ఫార్ములాకు చట్టబద్ధమైన హామీ కల్పిస్తామని 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని నిరాకరిస్తూ, పెరుగుతున్న సాగు ఖర్చులను తగ్గించడానికి నిరాకరిస్తూ, పేద మరియు మధ్యతరగతి రైతులకు, కౌలు రైతులకు మరియు వ్యవసాయ కూలీలకు సంపూర్ణ కేంద్ర రుణమాఫీని నిరాకరిస్తూ, మొత్తం రైతాంగాన్ని నిరంతరం మోసం చేస్తూనే, రూ. 16 లక్షల కోట్ల కార్పొరేట్ బకాయిలను రద్దు చేసిందన్నారు
భారతదేశంలో అత్యల్ప సంపన్న వర్గాలకు, అత్యధిక సంఖ్యలో ఉన్న శ్రామిక ప్రజలకు మధ్య అసమానత పెరుగుతోందనారు 2026 ఆక్సాఫామ్ నివేదిక ప్రకారం, అత్యంత సంపన్నులైన 1 శాతం మంది 40 శాతం సంపదను కలిగి ఉండగా, పై స్థాయిలోని 10 శాతం మంది జాతీయ ఆదాయంలో 60 శాతం సంపాదిస్తున్నారు అని అన్నారు అట్టడుగు 50 శాతం మంది జాతీయ ఆదాయంలో కేవలం 15 శాతం ఆదాయంతో జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కల్లూరి కిషోర్ పండూరి వీరబాబు చిరంజీవి కురసం ముత్యాలరావు చెన్నారావు కేశవరావు బండి ఆదినారాయణ కేసరి వెంకటేష్ సోయం నాగేశ్వరావు సోయం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


