Sunday, November 8, 2026

ఆపదలో అండగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ సమ్మయ్య గౌడ్

నవపక్షం, కేసముద్రం మండల ప్రతినిధి :

ప్రజల కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సోమారపు సామెల్ మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని సమ్మయ్య గౌడ్ పరామర్శించారు.

మృతుడి భార్య ముత్తమ్మ, కుమారుడు యాకుబ్‌ను పరామర్శించి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.

ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ పేదలు, నిరుపేదలు, ఆపదలో ఉన్న కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ముందుండి సహాయం చేయడం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా, సమ్మిగౌడ్ ఫౌండేషన్ స్థాపకుడిగా తన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజా సేవకు ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు.

కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచి సహాయం చేసిన సమ్మయ్య గౌడ్‌ను పాస్టర్ జీవన్‌తో పాటు ఎన్టీఆర్ నగర్ ప్రజలు అభినందించారు.

ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ వల్లందాస్ ఉమా రవి, కాంగ్రెస్ నాయకులు చిట్ల సంపత్, కీర్తి సురేందర్, మాసాడి శ్రీనివాస్, అజ్మీర రమేష్, పోలపల్లి వెంకటరెడ్డి, కత్తెరశాల శ్రీనివాస్, ఎన్నమాల మహేందర్, పాస్టర్ జీవన్, రమేష్ నాయక్, సోష్కండ్ల సుభాష్ రెడ్డి, సంకపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.