మాదక ద్రవ్యాలతోపాటు మద్యం,గుట్కా,పొగాకు,గంజాయి తదితర వ్యాసనాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజాపిత బ్రహ్మాకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ,కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చేపట్టిన దేశవ్యాప్త అవగాహన, ప్రచార ఉద్యమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు బ్రహ్మాకుమారీస్ సైలెన్స్ రిట్రీట్ సెంటర్ డైరెక్టర్ బి.కె.రాజ్ కుమారీ లాంఛనంగా ప్రారంభించారు. ఆగస్టు 6 నుంచి 20 వరకు నిర్వహించే ఈ ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మాకుమారీస్ ప్రతినిధులు అన్ని వర్గాలవారికి వ్యాసనాల బారి నుంచి కాపాడుకునే మార్గాలు,ధ్యానం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని పెంపొందించుకునే పద్దతులు నేర్పిస్తారు. డ్రగ్స్,పొగాకు,మొబైల్ కు బానిసలవటం తదితర వ్యసనాలకు దూరంగా ఉండేలా అన్ని వర్గాల ప్రజలతో ప్రతిజ్ఞలు చేయిస్తారు.ఈ నెల 20 వరకు 10కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బి.కె.రాజ్ కుమారీ తెలిపారు.తమ సేవాకేంద్రాల్లో అందరికీ ఉచితంగా ధ్యానం,కౌన్సిలింగ్ వంటివి నేర్పించి వ్యాసనరహిత ఆరోగ్యకర జీవితాన్ని అందిచేదుకు కృషి చేస్తున్నామని వివరించారు.ఈ ఉద్యమంలో ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థలు,స్కూల్-కాలేజీలు పెద్ద ఎత్తున పాల్గొని దేశాన్ని,రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా చేసేందుకు సహకరించాలని కోరారు.
డ్రగ్స్ నిర్మూలన కోసం 10కోట్ల ప్రతిజ్ఞలు ౼బ్రహ్మాకుమారీస్ “వ్యసన ముక్తి” ఉద్యమం ౼కలెక్టరేట్ లో ఘనంగా ప్రారంభం డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం బ్రహ్మాకుమారీస్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మహా ప్రచార ఉద్యమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం ఘనంగా ప్రారంభిచారు.
Popular Categories

