భువనగిరి: భువనగిరి పట్టణంలోని న్యూ వివేర కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ఫేజ్-2 సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నటరాజన్ మీనాక్షి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో SIR ఫేజ్-2 ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ శ్రేణుల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు, వేముల వీరేశం గారు, ఉత్తమ్ పద్మావతి గారు, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, మందుల సామేల్ గారు, బాలు నాయక్ గారు, బత్తుల లక్ష్మారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.SIR ఫేజ్-2లో అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ జాబితాలో ఉండేలా, ఎలాంటి అర్హత కలిగిన ఓటరు నష్టపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని సమావేశంలో సూచించారు.


