నవపక్షం, ఘన్‌పూర్:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్‌పూర్ మండలంలోని చెల్పూర్ గ్రామానికి చెందిన బీజేపీ కుటుంబ సభ్యులు జెట్టి శివ తల్లి జెట్టి సరోజన ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి చెల్పూర్ గ్రామానికి వెళ్లి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ సరోజన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. బాధలో ఉన్న కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆయన వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి, ఎరుకల గణపతి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాటికొండ రవికిరణ్, పెండ్యాల రాజు, జిల్లా కార్యదర్శి శివరాత్రి వేణు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుప్పటి భద్రయ్య, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.


