కొత్తగూడెం -నవ పక్షం :-
భారతరత్న, మాజీ ప్రధాని అమరజీవి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన… జిల్లాకాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న*
దేశంలో సాంకేతిక విప్లవ సృష్టికర్త రాజీవ్ గాంధీ….. డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న,
రాజీవ్ ని ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి*
భారతరత్న, దేశ ప్రధాని.. అమరజీవి రాజీవ్ గాంధీ 82వ జయంతిని కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీను అన్న క్యాంపు కార్యాలయంలో… రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు*
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న మాట్లాడుతూ. భారత దేశ అభివృద్ధికి శాస్త్రీయసాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి న సిద్ధాంతకర్త అని చెప్పారు., 18 సంవత్సరాల లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని కొనియాడారు*
రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న కార్యక్రమాల్లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొంటూ కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయడమే వారికి అర్పించే ఘన నివాళులని దేవి ప్రసన్న పిలుపునిచ్చారు*
ఈ కార్యక్రమంలో టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, జిల్లా అధికార ప్రతినిధి వై. శ్రీనివాస్ రెడ్డి,డిసిసి ప్రధాన కార్యదర్శులు ఎం. పెద్దబాబు, పైడా రాజేంద్రప్రసాద్, లో శెట్టి నాగార్జున, జిల్లా కార్యదర్శి ఆంతోటి పాల్, మురళి నాయక్, కార్పొరేటర్ జల్లి శ్రీలక్ష్మి,, కాంగ్రెస్ నాయకులు.. అచ్చ నాగరాజు, బొబ్బల వెంకట్,, సాంస్కృతిక సేన జిల్లా కార్యదర్శి రాము, చావల పురుషోత్తం, ఆకుల సుధాకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, ప్రణయ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు*


