ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సభ్యులపై రాజకీయ పార్టీలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అప్రజాస్వామికం: ఇ.ఎల్.వి. భాస్కర్

నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి :

సామాజిక బాధ్యతతో ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సభ్యులపై రాజకీయ పార్టీలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడాన్ని ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇ.ఎల్.వి. భాస్కర్ తీవ్రంగా ఖండించారు.

అన్ని రాజకీయ పార్టీలను,ప్రజా సంఘాలను కలుపుకొని కేవలం ప్రజల సంక్షేమం, సేవే లక్ష్యంగా ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

సమాజంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, పేదలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్న సభ్యులపై రాజకీయ కారణాలతో చర్యలు తీసుకోవడం అత్యంత విచారకరమని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

సేవా దృక్పథాన్ని ప్రోత్సహించాల్సిన సమయంలో, సేవ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం సంబంధిత వ్యక్తుల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు.

ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఫౌండేషన్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి సొంతం కాదని, ఏ పార్టీకి వ్యతిరేకం కూడా కాదని తెలిపారు. ప్రజా సేవే ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

రాజకీయ వేధింపులు, పార్టీ నిర్ణయాలు లేదా ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా సమాజ శ్రేయస్సు కోసం ఫౌండేషన్ బాటలో నడిచే సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఇ.ఎల్.వి. భాస్కర్ స్పష్టం చేశారు.

“యువతను అణచివేయాలని చూస్తే ఎంతటి వారైనా సహించేది లేదు. యువతలో సేవా స్ఫూర్తిని అడ్డుకోవడం ఎవరి వల్లా సాధ్యం కాదు. రానున్న రోజుల్లో యువతే ప్రజాస్వామ్య పద్ధతిలో సరైన సమాధానం చెబుతుంది” అని ఆయన అన్నారు.

రాజకీయాలకు అతీతంగా తమ సేవా ప్రయాణాన్ని మరింత విస్తృతంగా, నిరంతరాయంగా కొనసాగిస్తామని ఈ సందర్బంగా ఇ.ఎల్.వి. భాస్కర్ తెలిపారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.