22ఏ నిషేధిత భూముల బాధితుల తరఫున వినతి పత్రం A O గారికి వినతి పత్రం ఇచ్చిన బీజేపీ నాయకులు

*ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నందు 22ఏ నిషేధిత భూముల బాధితుల తరఫున వినతి పత్రం A O గారికి అందజేయడం జరిగిందితదనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22ఏ నిషేధిత భూముల జాబితాలో తప్పిదాలు జరిగినట్టు రెవిన్యూ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి అంగీకరించిన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని నిషేధిత భూముల జాబితాను రూపొందించడంలో జరిగిన తప్పిదాలను అక్రమంగా చేర్చినటువంటి భూముల సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేయాలని బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని 22ఏ జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని రెవెన్యూ శాఖ తప్పిదాలకు సంబంధిత శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్ ప్రభుత్వ పెద్దలకు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు ప్రజల భూ హక్కులకు సంబంధించిన అంశం కాబట్టి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని అన్నారు స్వయంగా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ 22ఏ జాబితాలో భారీగా భూములు చేర్చడంలో కుట్ర దాగి ఉందని బహిరంగంగానే మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములు విస్తీర్ణం ఎంత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆ జాబితాలో కొత్తగా చేర్చిన భూముల విస్తీర్ణం ఎంత ఏ ఉత్తర్వులను ఆధారంగా చేర్చారు అన్ని వివరాలు ప్రజలకు కచ్చితంగా తెలియాల్సిందే అని తెలియజేశారు ప్రభుత్వానికి సంబంధంలేని కనీసం కోర్టు వివాదాలు కూడా లేని పట్టాదారుల హక్కులు స్పష్టంగా ఉన్న భూములు కూడా నిషేధిత జాబితాలో చేర్చడాన్ని ఆయన తప్పు పట్టారు ధరణి మరియు భూభారతి పోర్టల్ డిజిటల్ రికార్డులలో 22ఏ జాబితాకు సంబంధించిన మార్పులు ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని ఎవరి ఆమోదంతో భూములు చేర్చారు ఎవరి ఆమోదంతో భూములను తొలగించారు అనే వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు ఈ నిషేధిత భూముల జాబితాలో తప్పుగా భూములు చేర్చడం వల్ల భూ యజమానులు తమ భూములను విక్రయించలేకపోవడం బ్యాంకు రుణాలు పొందలేకపోవడం కుటుంబ ఆస్తి లావాదేవీలు నిలిచిపోవడం వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు అందువల్ల ఈ జిల్లాలో ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మెకానిజం ఏర్పాటు చేసి బాధితుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాయ దశరథ, జిల్లా ఉపాధ్యక్షులు గూడూరు నరోత్తం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం, పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్ల బండి కృష్ణ చారి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫకీరు రాజేందర్ రెడ్డి, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు దయ్యాల కుమార్, భువనగిరి మండల అధ్యక్షులు చీర్క సురేష్ రెడ్డి, మరియు బబ్బురి సురేష్ , రత్తపురం శ్రీశైలం, చాంద్ పాషా, కానుకుంట్ల రమేష్, సుధాకర్, కారుపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.