నవపక్షం, నాంపల్లి :
PM SHRI TGMS పెద్దాపురం, నాంపల్లి, నల్గొండ పాఠశాలలో ఈ రోజు బాలికా సాధికారత కార్యక్రమం నిర్వహించారు. నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు శివాని, మోనిక కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా బాలికల ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత భద్రత, సాధికారత, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బాలికలు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకుని ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జి. భాగ్యలక్ష్మి, GCEB ఇన్‌చార్జి పి. గీతాంజలి, గైడ్స్ ఇన్‌చార్జి బాలలింగమ్మ, శ్రీమతి STI గారు పాల్గొని విద్యార్థినులను ప్రోత్సహించారు.
బాలికల్లో భద్రతపై అవగాహన, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత, సాధికారతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.


