యాదాద్రి భువనగిరి పోలీసుల ఆధ్వర్యంలో మహిళా భద్రత & బాలల పరిరక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళా భద్రత మరియు బాలల పరిరక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.మహిళలు, బాలికలు మరియు చిన్నారులకు సురక్షితమైన, భయరహిత వాతావరణాన్ని కల్పించడంతో పాటు, ప్రమాదాలను గుర్తించే సామర్థ్యం, అప్రమత్తత మరియు తమ హక్కులపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం.ఈ కార్యక్రమాల్లో పోలీసు అధికారులు మహిళలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రజలతో నేరుగా మాట్లాడి మహిళలపై వేధింపులు, గృహ హింస, సైబర్ నేరాలు, బాలలపై వేధింపులు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, లైంగిక దోపిడీ మరియు మహిళలు, బాలలపై జరిగే ఇతర నేరాల నివారణపై అవగాహన కల్పించారు.అలాగే పిల్లలు ప్రమాదకర పరిస్థితులను ముందుగానే గుర్తించేలా సురక్షితమైన మరియు అసురక్షితమైన స్పర్శ, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, సైబర్ వేధింపులు, ఆన్‌లైన్‌లో అపరిచితుల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవడం వంటి అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.మహిళలు, బాలలు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా, ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవను వినియోగించుకోవాలని ప్రజలకు తెలియజేశారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తూ, ఏదైనా అనుమానాస్పద పరిస్థితి కనిపించిన వెంటనే స్పందించాలని పోలీసులు సూచించారు. నేరాన్ని చూసి మౌనం వహించడం నేరస్తులకు ధైర్యాన్నిస్తుందని, సకాలంలో సమాచారం అందించడం ద్వారా నేరాలను అడ్డుకోవడంతో పాటు బాధితులను రక్షించవచ్చని వివరించారు.మహిళలు మరియు బాలలపై జరిగే నేరాల పట్ల జీరో టాలరెన్స్ విధానంతో యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని, మహిళలు గౌరవంగా, నిర్భయంగా జీవించేలా మరియు ప్రతి చిన్నారి సురక్షిత వాతావరణంలో ఎదిగేలా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.