నవపక్షం, హైదరాబాద్, ఆగస్టు 27 :
హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు.
గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యులతో మాట్లాడి అందుతున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి వెంట ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.


