నవపక్షం ,ఉండవల్లి ప్రతినిధి:
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఉండవల్లి నివాసంలో రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం మంత్రి నారా లోకేష్ తెలుగింటి ఆడపడుచులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.


