భువనగిరి క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ దాడి హేయమైన చర్య – ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై నిన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటనను భువనగిరి ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఈరోజు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, “క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేయడం హేయమైన చర్య.. ఇది రాజకీయం కాదు.. ప్రజాస్వామ్యంపై దాడి” అని అన్నారు.ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేయాలని, ప్రత్యర్థులపై నిర్మాణాత్మక విమర్శలు చేయాలి తప్ప దాడులు, హింసకు పాల్పడటం ప్రజాస్వామ్య సంస్కృతి కాదని అన్నారు. మారణాయుధాలతో క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా వేదిక అని, భువనగిరిలో ఇలాంటి దాడుల సంస్కృతి గతంలో ఎన్నడూ లేదన్నారు.బీజేపీపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు ఢిల్లీ నుంచి అమిత్ షా డైరెక్షన్‌లో బండి సంజయ్ మరియు బీజేపీ నాయకులు గుండా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు ఇన్ని రోజులు మేము సంయమనం పాటించాం.. మా ఓపికను బలహీనతగా భావించొద్దు. హద్దులు దాటితే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే గట్టిగా సమాధానం చెబుతాం” అని హెచ్చరించారు.ఇటీవల నల్గొండలో మంత్రి ఇంటిపై జరిగిన దాడిని కూడా ప్రస్తావిస్తూ, బీజేపీ హింసాత్మక రాజకీయాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. “చెప్పేది రాముడి పేరు.. చేసేది రావణకాండ” అన్న రీతిలో బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.నిన్నటి ఘటన అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించారని, ఈరోజు క్యాంప్ కార్యాలయాన్ని గోపంచకంతో శుద్ధి చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హింసకు ఎప్పటికీ తలొగ్గదని స్పష్టం చేశారు.బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు బీఆర్ఎస్‌పై కూడా ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “తెలంగాణలో 1000 రోజుల దగా” అంటూ బీఆర్ఎస్ మరో కొత్త రాజకీయ నాటకానికి తెరతీసిందని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే అబద్ధాలు, అసత్య ప్రచారాలను మానుకోవాలని సూచించారు.గత ప్రభుత్వ పాలనలో జరిగిన వైఫల్యాలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని, ప్రజా సమస్యలపై చర్చించకుండా రాజకీయ నాటకాలు చేయడం సరికాదన్నారు.కేసీఆర్ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి హాజరుకాకుండా ప్రజా సమస్యలకు దూరంగా ఉండటం సరికాదని విమర్శించారు. ప్రజల కోసం పని చేయని కేసీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.డైరెక్టర్స్,పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, డీసీసీ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ అనుబంధ విభాగాల నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.