నవపక్షం, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద నియామకానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. మహిళా హక్కులు, భద్రత, సాధికారత కోసం పనిచేసిన అనుభవం ఉన్న శారద గతంలోనూ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
మహిళా కాంగ్రెస్‌లో రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమెకు మహిళా సమస్యలపై సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో మహిళలపై హింస, వేధింపులపై కమిషన్‌ను చురుకుగా నడిపించారు.
ఇదే సమయంలో గద్వాల విజయలక్ష్మిని తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్‌గా నియమించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. డా. జి. చిన్నారెడ్డి స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.
మహిళా హక్కుల పరిరక్షణ, మహిళా భద్రతకు మరింత ప్రాధాన్యతనిస్తూ నేరెళ్ల శారద నాయకత్వంలో మహిళా కమిషన్ మరింత సమర్థవంతంగా పనిచేయనుంది.


