*ప్రజాపాలనలో 1000 రోజులు ఓ మైలురాయిగా నిలిచిపోయింది అని యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ విలేకరులతో మాట్లాడుతూ ప్రజా పాలన1000 రోజుల పండుగలో విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులకు శుభాకాంక్షలు పద్మ తెలిపారు.
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత
రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ.. 25 లక్షల మంది రైతులకు రుణ విముక్తి
రైతు భరోసాను ఎకరానికి రూ.12 వేలకు పెంచాం
ధాన్యం కొనుగోళ్లు, సన్నవడ్ల బోనస్‌తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసి రికార్డు సృష్టించాం
రూ.20 వేల కోట్లకు పైగా రుణమాఫీ.. 25.35 లక్షల మంది రైతులకు లబ్ధి
రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు అందించాం
ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రూ.30 వేల కోట్లు ఖర్చు
సన్నవడ్ల బోనస్‌కు దాదాపు రూ.4 వేల కోట్లు కేటాయింపు
రైతుబీమాకు రూ.3,500 కోట్లు ఖర్చు చేశాం
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
రూ.500కే ఎల్పీజీ సిలిండర్ పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
పేదల ఆశలు నెరవేర్చే దిశగా 16.32 లక్షల కొత్త రేషన్ కార్డుల జారీ
1.06 కోట్ల ఆహార భద్రత కార్డులతో 3.43 కోట్ల మందికి ప్రయోజనం
తెలంగాణ యువతలో విశ్వాసం కలిగించేలా 70 వేలకు పైగా ప్రభుత్వ నియామకాలు
యువత నైపుణ్యాభివృద్ధికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు
ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నాంపాఠశాలలు, కళాశాలల్లో అల్పాహారం ప్రారంభం100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం బీసీ కులగణనతో సామాజిక న్యాయానికి పెద్దపీట స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాం రైతులు, మహిళలు, వ్యవసాయ కూలీలు, బలహీనవర్గాలను ప్రభుత్వ విధానాలకు కేంద్రబిందువుగా మార్చాం రాహుల్ గాంధీ సామాజిక న్యాయ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణలో కీలక నిర్ణయాలను తీసుకుంటూ ఇంకా ప్రజలకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసి ఊరు లేక బీఆర్ఎస్ .బిజెపి వాళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ప్రజలు ఎవరి పరిపాలన బాగుందో చూస్తున్నారని పద్మ అన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి. కౌన్సిలర్స్ లావణ్య సరోజ ధనలక్ష్మి. రహీమా బేగం .స్టేట్ సెక్రెటరీ పావని. మార్కెట్ చైర్మన్ చైతన్య. జిల్లా జనరల్ సెక్రెటరీ పుష్ప మండల అధ్యక్షులు కాల్యే లత. రేణుక. మమత. కల సర్పంచులు మొదలగు వారు పాల్గొన్నారు.


