దుబ్బాక–మునిపంపుల గ్రామాల్లో రోడ్డు గుంతలను వెంటనే పూడ్చాలి – ఆర్&బి కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో డీఈ కాళీ కుర్చీకి వినతిపత్రాలు ఇచ్చి సీపీఎం సర్పంచుల వినూత్న నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా, నవపక్షం 

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక–మునిపంపుల గ్రామాల మధ్య అస్తవ్యస్తంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డు గుంతలను వెంటనే పూడ్చి, ప్రజల సమస్యను పరిష్కరించాలని మునిపంపుల, దుబ్బాక గ్రామాల సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం, గట్టు నర్సింహా డిమాండ్ చేశారు. రోడ్డు మరమ్మతుల విషయంలో పలుమార్లు సంబంధిత ఆర్&బి అధికారులను కలిసి విన్నవించినప్పటికీ అధికారులు అందుబాటులో లేకపోవడం, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం వినూత్న నిరసన చేపట్టారు.అధికారులు కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఆర్&బి డీఈ ఖాళీ కుర్చీకి వినతిపత్రాలు సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు నిత్యం ప్రయాణించే ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని, ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులు, ప్రయానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన రోడ్డు గుంతలను పూడ్చడంలో ఆర్&బి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రజల సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, పాదయాత్ర, ధర్నాలు, వినతి పత్రాలు అందించి నిరసనలు చేసినా పట్టించుకోకపోవడం సరికాదన్నారు.రెండు రోజుల్లో రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించకపోతే ఆయా గ్రామాల ప్రజలను సమీకరించి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని, ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రజల సమస్యల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత ఆర్&బి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యుడు మేడి గణేష్, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకుడు గుండాల నరేష్, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్, వేముల మల్లేశం, కంబాలపల్లి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.