నవపక్షం, మద్నూర్, సెప్టెంబర్ 8, 2026:
కామారెడ్డి జిల్లా, మద్నూర్ మండలం, అంతాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు వాగ్మారే మారుతి గారి అన్న కుమారుడు అనారోగ్య కారణాలతో అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విషయం తెలుసుకున్న జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మంగళవారం అంతాపూర్ గ్రామానికి స్వయంగా విచ్చేసి, వాగ్మారే మారుతి గారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అనంతరం మృతిచెందిన చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. బాధిత కుటుంబానికి ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.
ప్రజలకు కష్టసుఖాల్లో అండగా ఉంటూ, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా హన్మంత్ షిండే మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

