చండ్రుగొండ, నవ పక్షం :-
BRS పార్టీదళిత వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు, DCC అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆదేశాలతో, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పిలుపు మేరకు అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చండ్రుగొండ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బడుగు కృష్ణవేణి మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీ సాక్షిగా స్పీకర్‌పై BRS ఎమ్మెల్సీ తాతా మధు, ఇతర ఎమ్మెల్యేలు చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించే విధంగా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. అదేవిధంగా దళితులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్‌హౌస్ ముట్టడికి వెళ్లిన సందర్భంగా వారు నడిచిన మార్గాన్ని పసుపు నీటితో శుద్ధి చేసిన ఘటనపై కూడా ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని, డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దళితులపై వివక్ష చూపే BRS ,BJP పార్టీల వైఖరినీ మహిళా కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, దళితుల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు , కార్యకర్తలు పాల్గొన్నారు….

