మస్కులర్ డిస్ట్రోపీ బాధిత బాలకృష్ణకు మిత్రుల ఆర్థిక సాయం

నవపక్షం, భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : 

మేదరమెట్ల గ్రామానికి చెందిన పసునుటి బాలకృష్ణ కొన్నేళ్ల క్రితం అకస్మాత్తుగా కాళ్లలో తిమ్మిర్లు రావడం, నడవలేక కిందపడిపోవడం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడటం ప్రారంభించారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి వైద్య పరీక్షలు చేయించగా, బాలకృష్ణ కండరాల క్షీణత వ్యాధి (మస్కులర్ డిస్ట్రోపీ)తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు.

రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబంపై విధి పగబట్టినట్లుగా, ఈ మాయదారి వ్యాధి బాలకృష్ణను మంచానికే పరిమితం చేసింది. కుటుంబాన్ని చూసుకోవాల్సిన వ్యక్తి అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో భార్య, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న పదో తరగతి 2009–2010 బ్యాచ్‌కు చెందిన బాలకృష్ణ స్నేహితులు మానవతా దృక్పథంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. స్నేహితులందరూ కలిసి తమ వంతు సహాయంగా రూ.25 వేల నగదును సేకరించి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు అందజేసి అండగా నిలిచారు.

ఆపద సమయంలో తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రుల మానవత్వాన్ని పలువురు అభినందించారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులోనూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్నేహితులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 2009–2010 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన బాలకృష్ణ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.