నవపక్షం, మాద్నూర్ మండల ప్రతినిధి :
కామారెడ్డి జిల్లా, మాద్నూర్ మండల పరిధిలోని చిన్న శక్కర్గ గ్రామ సర్పంచ్ దిగంబర్ అనారోగ్యంతో నిజామాబాద్‌లోని హోప్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని స్థానిక శాసనసభ్యులు లక్ష్మీకాంత రావు మరియు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, సర్పంచ్ దిగంబర్ ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందిస్తున్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. దిగంబర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి గ్రామ ప్రజలకు సేవనందించాలని వారు ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


