నవపక్షం, మహబూబ్‌నగర్ ప్రతినిధి :
ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాల, మహబూబ్‌నగర్‌లో బీఈడీ విద్యార్థులు తమ అకాడమిక్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాల అధ్యాపక బృందాన్ని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కళాశాల సూపరింటెండెంట్ రామకృష్ణ, అధ్యాపకులు జనార్దన్ రెడ్డిలను బీఈడీ విద్యార్థులు శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. విద్యార్థుల విద్యాభ్యాసంలో అధ్యాపకులు అందించిన మార్గదర్శకత్వం, సహకారానికి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీఈడీ విద్యార్థి కార్తీక్ నాయక్తో పాటు బీఈడీ విద్యార్థులు రమాదేవి, రోహిణి, లోకేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.


