నవపక్షం, దమ్మపేట మండల ప్రతినిధి :-
దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమం అనంతరం స్థానిక సర్పంచ్ ఇస్లావత్ శ్రీనివాసరావు, వైస్ సర్పంచ్ కుంపటి వేణు, గ్రామ కార్యదర్శి కోండ్రు నాగేంద్రబాబు జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం వంటవారితో మాట్లాడి విద్యార్థులకు శుభ్రమైన భోజనం అందించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బజ్జురి సరళ, పాఠశాల స్టాప్ పాల్గొన్నారు


